For Money

Business News

NIFTY TODAY: 17477 కీలకం

ముందుగా,,, చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది. బడ్జెట్‌లో ఎలాంటి అంచనాలు లేవు. పైగా అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. మన మార్కెట్లు కూడా పెరుగుతున్నాయి. కాని పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్రూడ్‌ ఆయిల్‌ ధరల మధ్య కంపెనీల లాభదాయకతపై అనేక అనుమానాలు ఉన్నాయి. పైగా ఈ వారమంతా చైనా మార్కెట్లకు సెలవు. అమెరికా మార్కెట్ల లాభాలు పూర్తి అక్కడి లోకల్‌ అంశాలే. అందుకే జపాన్‌ వంటి మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా అమ్ముతూనే ఉన్నారు. కాబట్టి చిన్న ఇన్వెస్టర్లు ఇవాళ మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది. ఇక రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు టెక్నికల్‌ స్థాయిలను బట్టి ట్రేడ్‌ చేయొచ్చు. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ 17528
రెండో ప్రతిఘటన 17477
తొలి ప్రతిఘటన 17443
నిఫ్టికి కీలకం 17284
నిఫ్టి తొలి మద్దతు 17237
నిఫ్టి రెండో మద్దతు 17203
డౌన్‌ బ్రేకౌట్‌ 17152

నిఫ్టి 17477 దాటితే అమ్మకండి. అంతక్రితం బలహీనంగా ఉంటే అమ్మొచ్చు. విదేశీ ఇన్వెస్టర్లు బడ్జెట్‌ కంటే యూపీ ఎన్నికల ఫలితాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బడ్జెట్‌ ఏమాత్రం నిరాశజనకంగా ఉన్నా… విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నిన్న మార్కెట్‌ భారీగా పెరిగినా.. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3624 కోట్ల నికర అమ్మకాలు చేశాయి. అదే స్థాయిలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడంతో నిఫ్టి భారీగా పెరిగింది.