For Money

Business News

NIFTY TODAY: 16500 కీలకం

రాత్రి అమెరికా మార్కెట్లకు ప్రపంచ మార్కెట్లు స్పందిస్తున్నాయి. కాని అమెరికా ఆంక్షల కారణంగా అనేక వర్ధమాన దేశాలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రష్యాతో ఆర్థిక బంధాలు ఉన్న దేశాలకు కష్టాలు తప్పవు. అలాగే రష్యా కంపెనీలతో లావాదేవీలు నిర్వహించే కంపెనీలు కూడా ప్రతికూల పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌ విషయానికొస్తే… ఇవాళ్టి నుంచి మార్చి నెల డెరివేటివ్స్‌ ప్రారంభం కానున్నాయి. అధిక స్థాయిలో నిఫ్టి నిలబడుతుందా అన్న అనుమానం విశ్లేషకుల్లో ఉంది. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్లు ఈ ఏడాది భారీగా నష్టపోయారు. ఎంతగా అంటే అనేక కొత్త కంపెనీల షేర్లు 50 శాతంపైగా నష్టపోయాయి. కాబట్టి వెంటనే మార్కెట్‌లోకి ప్రవేశించడం అనుమానమే. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు నిన్న కూడా భారీ స్థాయిలో అమ్ముతూనే ఉన్నాయి. డే ట్రేడింగ్‌కు లెవల్స్…

రెండో ప్రతిఘటన 16,594
తొలి ప్రతిఘటన 16,500
నిఫ్టికి కీలక స్థాయి 16,311
తొలి మద్దతు 15,996
రెండో మద్దతు 15,903