NIFTY CLOSE: 15,900 అత్యంత కీలకం
16700 ప్రాంతంలో టెక్నికల్ అనలిస్టుల అంచనాలు నిజమౌతున్నాయి. 16800 స్థాయిని నిఫ్టి క్రాస్ చేయకుంటే మళ్ళీ 16000 దిగువకు వెళుతుందన్న అంచనా ఇవాళ నిజం కానుంది. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16900 స్థాయి దిగువకు వచ్చే అవకాశముంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం మూడు శాతం పడటమేగాక… ఇపుడు ఫ్యూచర్స్ కూడా ఒక శాతం నష్టంతో ఉన్నాయి. వెరశి అనేక సూచీలు మూడు శాతంపైగా నష్టపోయాయి. జర్మనీ డాక్స్ కూడా శుక్రవారం 3 శాతం నష్టపోయింది. ఇవాళ కూడా మరో ఒక శాతం నష్టపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి కనీసం మూడు శాతం క్షీణంచినా.,..450 పాయింట్లకు పైగా పతకం కావాల్సి ఉంది. క్లోజింగ్‌లో ఈ స్థాయి నష్టాలు లేకున్నా… ఇంట్రా డేలో కచ్చితంగా 3 శాతం క్షీణిస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇవాళ నిఫ్టికి 16019 శాతం కీలకం. ఈ స్థాయి ఇవాళ కోల్పోనుంది. తరువాతి స్థాయి 16880. ఇక్కడికి నిఫ్టి రావడమంటే మార్కెట్‌లో బేర్ ఫేజ్ మళ్ళీ ప్రారంభమైనట్లే. అంటే రిలీఫ్ ర్యాలీ ముగిసినట్లే. కొన్నాళ్ళు పాటు మార్కెట్‌కు దూరంగా ఉండి.. నిఫ్టి నిలదొక్కుకునేంత వరకు వెచి ఉండాల్సిందిగా ఇన్వెస్టర్లకు చాలా మంది అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టి పడిందని వెంటనే కొనుగోలు చేయొద్దని, మార్కెట్‌లో ఇంకా వీక్‌నెస్ ఉందని హెచ్చరిస్తున్నారు. క్రూడ్ ధరలు తగ్గినట్లు కన్పిస్తున్నా… డాలర్ పెరిగిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. క్రూడ్ దిగుమతి భారం ఏమాత్రం తగ్గలేదని, కంపెనీల మార్జిన్స్‌పై ఒత్తిడి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే నిఫ్టిని షార్ట్ చేసినవారు 15900 దిగువన పాక్షిక లాభాలు స్వీకరించమని సలహా ఇస్తున్నారు. నిఫ్టిని ఏ స్థాయిలోనూ కొనుగోలు చేయొద్దని అంటున్నారు. నిఫ్టి కన్సాలిడేషన్ చాలా ముఖ్యమని.. చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిదని అంటున్నారు. బాగా పడిందని కొంటే… చేతులు కాల్చుకునే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.