లిస్టింగ్ రోజు వంద శాతం లాభం?
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ స్పందనకు పోటీగా అనధికార మార్కెట్‌లో ప్రీమియం పెరుగుతోంది. కంపెనీ షేర్లను రూ. 70 గరిష్ఠ ధరకు ఆఫర్ చేస్తోంది. గ్రే మార్కెట్లో ప్రీమియం నిన్న రూ. 63 ఉండగా, ఇవాళ రూ. 70కి చేరింది. అంటే లిస్టింగ్ రోజున వంద శాతం లాభం వస్తుందన్నమాట. మరి ఈ ప్రీమియం లిస్టింగ్ వరకు ఉంటుందా? ఇష్యూ ముగిసిన వెంటనే తగ్గుందా అనేది చూడాలి. మరోవైపు పబ్లిక్ ఆఫర్‌లో సాధారణ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లకు ఏడు రెట్ల మేరకు ఇష్యూ ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. ఇష్యూ రేపు ముగియనుంది. అత్యధికంగా ఎన్‌ఎన్‌ఐలవిభాగం 16.45 శాతం ఓవర్ సబ్‌స్క్రయిబ్ కాగా, షేర్ హోల్డర్ల విభాగం ఓవర్ సబ్ స్క్రిప్షన్ 9.54 శాతం ఉంది. మెజారిటీ బ్రోకర్లు ఈ ఇష్యూకు దరఖాస్తు చేయాలని సిఫారసు చేయడంతో చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముంది.