For Money

Business News

బడ్జెట్‌ కోసం ఈ పది షేర్లు

మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుంది. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ కీలక నిర్ణయాలు తీసుకోని మోడీ ప్రభుత్వం ఈసారి మాత్రం మార్కెట్‌ను మురింపింవచచ్చిన భావిస్తున్నారు. బడ్జెట్‌ వరకు ఉంచుకోదగ్గ షేర్లను ఎకనామిక్ టైమ్స్‌ పత్రిక సూచించింది. ఈ షేర్లను చోళ సెక్యూరిటీస్‌ సంస్థ సిఫారసు చేసింది.
1. ఆర్‌బీఎన్‌ఎల్
ఈసారి కూడా బడ్జెట్‌లో రైల్వేలకు అధిక ప్రాధాన్యం లభింవచ్చు. ముఖ్యంగా బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్‌లు వేయడంతోపాటు పలు డబుల్‌ లేన్‌ ట్రాక్‌లను నాలుగు లేన్ల ట్రాక్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశముంది. కాబట్టి ఈ షేర్‌ ధర పెరిగే అవకాశముంది.
2. ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌
ఈసారి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం మౌలిక రంగాల్లో పెట్టుబడులను భారీగా పెంచొచ్చు. 2021-25 మధ్యంతర బడ్జెట్‌లో మౌలిక రంగానికి కేంద్రం రూ. 11,11,111 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.10 లక్షల కోట్లను ఈసారి మించింది. కొత్త బడ్జెట్‌లో మరింత ఫోకస్‌ పెట్టే అవకాశముంది.
3. హెచ్‌ఏఎల్‌
గత మధ్యంతర బడ్జెట్‌ రూ. 47.66 లక్షల కోట్లు కాగా ఇందులో రూ. 6.22 లక్షల కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు. ప్రస్తుతం ఈ కంపెనీ వద్ద రూ. 94 వేల కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్‌లో కేటాయింపులు మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది. కాబట్టి ఈ షేర్‌ను అట్టిపెట్టుపెట్టుకోవచ్చు.
4. డీసీఎక్స్‌ సిస్టమ్స్‌
దేశీయ కంపెనీలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో 75 శాతం మొత్తాన్ని దేశీయ కంపెనీలకే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మనదేశంలో ప్రాజెక్టులు చేపట్టే విదేశీ కంపెనీలు మన దేశ కంపెనీలతో జత కట్టే అవకాశముంది. డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ కూడా పలు విదేశీ కంపెనీలతో ఒప్పందానికి సిద్ధమౌతోంది.
5. జీఐసీ
సాధారణ బీమా రంగానికి చెందిన ఈ కంపెనీకి కూడా ఈ బడ్జెట్‌ వల్ల భారీ ప్రయోజనం కలిగే అవకాశముంది. 2025కల్లా రీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం మొత్తం 1200 కోట్ల డాలర్లకు చేరే అవకాశముంది.
6. ఎల్‌ఐసీ
దేశంలో అతి పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌ ఎల్‌ఐసీ.ఈ కంపెనీ వద్ద రూ. 43.97 లక్షల కోట్ల నిధులు ఉన్నాయి. 13.47 లక్షల మంది ఏజెంట్లతో 51.26 శాతం మార్కెట్‌ షేర్‌తో ఈ కంపెనీ అగ్రస్థానంలో ఉంది.
7. జీఎండీసీ
అంతర్జాతీయంగా మౌలిక ప్రాజెక్టులలో పెట్టుడులు భారీగా పెరగడం, ముఖ్యంగా డిఫెన్స్‌ రంగంలో పెట్టుబడులు పెరగడంతో జీఎండీసీకి ప్రాధాన్యం పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మెటల్స్‌కు డిమాండ్‌ పెరగడమే. కాపర్‌, జింక్‌, స్టీల్‌ ఖనిజాలకు డిమాండ్‌ పెరుగుతోంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో మెటల్స్‌ ధరలు పెరిగే అవకాశముంది.
8. టెక్స్‌మాకో రెయిల్‌
టెక్స్‌మాకో రెయిల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ షేర్‌ కూడా భారీగా పెరిగే అవకాశముంది. రైల్వే మౌలిక ప్రాజెక్టులకు ప్రభుత్వం బడ్జెట్‌ పెంచడమే దీనికి కారణం. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ రంగానికి కేటాయింపులు రూ. 2.55 లక్షల కోట్లు దాటాయి. 1,50,000 గూడ్స్‌ కార్స్‌ను కొనుగోలు చేయాలని భారత రైల్వే భావిస్తోంది.

9. ఐసీఐసీఐ బ్యాంక్‌
భారీ సంఖ్యలో బ్రాంచీలు ఉండటంతో పాటు విస్తృత ఏటీఎం నెట్‌వర్క్‌ ఉన్న బ్యాంకింగ్‌ రంగంలో ప్రధాన బ్యాంక్‌గా ఈ బ్యాంక్‌ రాణిస్తోంది. క్వాలిటీ రుణాలతో పాటు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో బ్యాంక్‌ మంచి పనితీరు కనబరుస్తోంది.
10. ఎస్‌బీఐ
దేశంలో ప్రభుత్వ రంగ అగ్రగామి బ్యాంక్‌గా ఉన్న ఎస్‌బీఐ పలు విభాగాల్లో తన పట్టు నిలుపుకొంటోంది. డిపాజిట్లలో 22.55శాతం, రుణాల్లో 19.06 శాతం మార్కెట్‌ షేర్‌ ఈ బ్యాంక్‌దే. డెబిట్‌ కార్డ్‌ ద్వారా చెల్లింపు మార్కెట్‌లో 25 శాతం, ఏటీఎం మార్కెట్‌లో 29 శాతం వాటా ఈ బ్యాంక్‌కు ఉంది. ఇక మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఈ బ్యాంక్‌ వాటా 25శాతంపైనే.