10 శాతం క్యాష్‌బ్యాక్: ఎస్‌బీఐ కార్డ్స్
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ కార్డ్స్ వెల్లడించింది. అక్టోబర్ 3న ప్రారంభమై.. 5వ తేదీ వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని పేర్కొంది. ఏ ఈ-కామర్స్ సంస్థ నుంచి కొనే అన్ని రకాల వస్తువుల కొనుగోలుపైనా ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్న వారికి కూడా ఈ ఆఫర్ ఉంటుందని పేర్కొంది. అయితే కొనే సమయంలోనే ఈఎంఐ ఆప్షన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుందని తెలిపింది.