For Money

Business News

స్వీపర్‌ పోస్టుకు 1.7 లక్షల దరఖాస్తులు

అదీ ఒక స్వీపర్‌ పోస్టు
పైగా తాత్కాలిక పోస్టు
నెలకు జీతం రూ. 15,000
హర్యానా కౌషల్‌ రోజ్‌గార్‌ నిగమ్‌ వేసిన ఈ ఉద్యోగ ప్రకటనకు ఏకంగా 1.66 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 6వేల మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, 40వేల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ప్రభుత్వ విభాగాల్లో తాత్కాలిక స్వీపర్‌ పోస్ట్‌ కోసం ఆయా విభాగాల తరఫున హర్యానా కౌషల్‌ రోజ్‌గార్‌ నిగమ్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్‌ 2వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. హర్యానాలో ప్రైవేట్‌ సంస్థలు కూడా చిన్న ఉద్యోగులకు రూ. 10వేలు ఇవ్వడం లేదని, అందుకే తాము దరఖాస్తు చేశామని పలువురు దరఖాస్తు దారులు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ప్రతినిధితో అన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగమైనా… భవిష్యత్తులో పర్మనెంట్ చేస్తారనే ఆశ ఉందని వీరు తెలిపారు. హర్యానాలో నిరుద్యోగుల సంఖ్య ఈ స్థాయిలో ఉందో ఈ ఉద్యోగ ప్రకటన తెలియజేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నారు. ఒక్క హర్యానాలోనే కాదు… దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.