For Money

Business News

నిఫ్టి… కొత్త గరిష్ఠ స్థాయిలకు రెడీ

జూన్‌ నెల డెరివేటివ్స్‌ ఇవాళ ప్రారంభం కానుంది. నిన్న రోల్‌ ఓవర్స్‌ ఆశాజనకంగా ఉన్నాయి. గత మూడు నెలల సగటు కన్నా అధికంగా రోల్స్‌ ఓవర్స్ ఉన్నాయి. రోల్‌ ఓవర్స్ 70 శాతం ఉండటంతో జూన్‌లో నిఫ్టి కచ్చితంగా 15600, 15900 టార్గెట్‌ దిశగా పయనిస్తున్నట్లు టెక్నికల్‌ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
డే ట్రేడింగ్‌ కోసం నిఫ్టిని కొనుగోలు చేయొచ్చు. అయితే నిఫ్టి పడుతుందేమో వెయిట్‌ చేయండి. మిడ్‌ సెషన్‌లోగా ఛాన్స్‌ రావొచ్చు. 15,250 స్టాప్‌లాస్‌. కాస్త రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 15,180 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. టార్గెట్‌ 15430. పొజిషనల్‌ ట్రేడర్స్‌ ఇదే స్టాప్‌లాస్‌తో పొజిషన్స్‌ కంటిన్యూ చేయొచ్చు. జూన్‌ సిరీస్‌లో నిఫ్టి కొత్త ఆల్‌టైమ్‌ హైని తాకే అవకాశముంది. అయితే నిఫ్టి గరిష్ఠ స్థాయిలో ఉంది కాబట్టి… ప్రతి టార్గెట్‌కు ఓ స్టాప్‌లాస్‌ పెట్టుకుని ట్రేడ్‌ చేయండి.

బ్యాంక్‌ నిఫ్టిలో ట్రేడ్‌ చేసేవారు 35488 టార్గెట్‌తో 34,500 స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయొచ్చుని స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ ప్రకాష్‌ గాబా సీఎన్‌బీసీ టీవీ18తో అన్నారు.