స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. దాదాపు అన్ని మార్కెట్లలో ఎలాంటి చలనం లేదు. నిన్న యూరో మార్కెట్లు దాదాపు క్రితం స్థాయి వద్దే ముగిశాయి. రాత్రి అమెరికా మార్కెట్లు అంటే. డాలర్ ఇండెక్స్ 90పైనే ఉండగా, క్రూడ్ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇక బంగారం కూడా గ్రీన్‌లో ఉంది. ఈనేపథ్యంలో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా స్థిరంగా ఉన్నాయి. నామ మాత్రపు మార్పులతో ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ నష్టాల్లో ఉండగా హాంగ్‌సెంగ్, చైనా గ్రీన్‌లో ఉన్నాయి. మార్పు మాత్రం జీరో. సింగపూర్ నిఫ్టి కూడా చాలా డల్‌గా ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ప్రారంభమయ్యే అవకాశముంది.
