For Money

Business News

అమెరికాలో అదానీపై దర్యాప్తు

అమెరికాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీకి ఇబ్బందులు తప్పడం లేదు. హెండెన్‌బర్గ్‌ నివేదిక తరవాత అమెరికాలో గౌతమ్‌ అదానీపై లంచం ఆరోపణలు తెరపైకి వచ్చాయి. భారత్‌లో ప్రాజెక్టులు పొందేందుకు అమెరికాకు చెందిన కంపెనీతో కలిసి లంచాలు ఇచ్చారనే ఆరోపణలు అదానీ వస్తున్నాయి. ఈ లంచం ఆరోపణలకు సంబంధించి అదానీతో పాటు అదానీ గ్రూప్‌పై అమెరికాలో దర్యాప్తు జరుగుతున్నట్లు బ్లూంబర్గ్‌ వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా అటార్నీ ఆఫీస్‌ ఫర్‌ ది ఈస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌తో పాటు వాషింగ్టన్‌లోని జస్టిస్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఫ్రాడ్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదానీ గ్రూప్‌తో పాటు అజుర్‌ పవర్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌పైనా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడటంతో పాటు అక్రమ విధానాల్లో కంపెనీల షేర్ల ధరను కృత్రిమంగా పెంచుకుంటూ వచ్చిందని అమెరికన్‌ షార్ట్‌ సెల్లింగ్‌, మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ గత ఏడాది జనవరి 24న అదానీ గ్రూప్‌పై ఓ నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజా ఆరోపణలకు మార్కెట్‌లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.