ఈ లాభాలు నిలిచేనా?
ఉదయం నుంచి గిఫ్ట్ నిఫ్టి గ్రీన్‌లో ఉంది. కాకపోతే ఉదయం వంద పాయింట్లు ఉన్న ఈ సూచీ ఇపుడు 50 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది. బ్రెంట్ క్రూడ్ పెరుగుతున్న కొద్దీ సూచీల బలహీనపడుతోంది. ఇవాళ నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమైనా… ఆరంభ లాభాలు ఉంటాయా అన్న టెన్షన్ ఇన్వెస్టర్లలో నెలకొంది. దీనికి ప్రధాన కారణంగా మార్కెట్ బ్రెడ్త్ ఇంకా నెగిటివ్‌లో ఉండటం. అలాగే నిఫ్టి PCR మళ్ళీ 1ని దాటడం. ఇదే సమయంలో ఇవాళ నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా. దీనివల్ల ఉదయం కాస్త షార్ట్ కవరింగ్ వచ్చినా… చివరి వరకు ఉంటాయా అన్నది చూడాలి. ఎందుకంటే నిన్న షార్ట్ కవరింగ్‌తోపాటు లాంగ్ అన్‌వైండింగ్ కూడా జోరుగా ఉంది. ఇలాంటి సమయంలో మార్కెట్ ఏమాత్రం గట్టి పెరిగినా మళ్ళీ షార్ట్స్‌కు ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎఫ్ అండ్ ఓతో పాటు క్యాష్‌లో కూడా విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేస్తున్నారు. మరో రెండు, మూడు సెషన్స్ నిన్నటి మాదిరి లాభాలు వస్తే… అపుడు నిఫ్టి కొనే అంశాన్ని పరిశీలించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
