For Money

Business News

నో నంబర్‌… యూజర్‌ నేమ్‌ చాలు

ఇక నుంచి వాట్సప్‌ వాడాలంటే మీరు కచ్చితంగా మీ నంబర్‌ను షేర్‌ చేయాల్సిన పనిలేదు. గోప్యత కోసం ఫోన్ నంబర్లకు బదులుగా యూజర్‌ నేమ్‌తో కనెక్ట్‌ అయ్యే ఫీచర్‌ను వాట్సప్‌ అభివృద్ధి చేసింది. దీంతో నంబర్‌కు బదులుగా పేరు ద్వారా వినియోగదారులను మీరు సెర్చ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం, వాట్సాప్ సెట్టింగ్స్‌లో రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్‌తో పాటు ప్రొఫైల్ పేరును కూడా ఈ ఫీచర్‌ చూపిస్తుంది. మెటాకు చెందిన ఈ వాట్సప్‌లో యూజర్‌నేమ్ లేదా పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యే సౌకర్యం లేదు. మీ ఫోన్ నంబర్‌ను కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యాపార సంస్థలకు ప్రత్యేక బ్రాండింగ్‌ ఇస్తూ యూజర్‌ నేమ్‌ ఇచ్చేందుకు వాట్సప్‌ ప్రయత్నిస్తోంది. బిజినెస్‌ మోడల్‌కు చార్జీలు ఉంటాయి. జూన్‌ నెలకల్లా బేటా వర్షన్‌ అందుబాటులోకి రానుంది. 2027జూన్‌కల్లా పూర్తిస్థాయిలో ఈ ఫీచర్‌ను తేనున్నారు. మొబైల్‌ నంబర్‌ను షేర్‌చేయకుండా యూజర్‌ నేమ్‌తో మెసేజ్‌లు పంపండి, చాటింగ్‌ చేసేందుకు కొత్త సర్వీసు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఫేస్‌బుక్‌ మోడల్‌లో యాడ్స్‌ను కూడా వాట్సప్‌లో ఆమోదించనున్నారు. తమ ఫోన్‌ నంబర్‌ను షేర్‌ చేసుకోకుండా కొత్త గ్రూప్‌లను, వ్యక్తలతో మెసేజ్‌లు షేర్‌ చేసుకోవడం, చాట్‌ చేయడం కొత్త ఫీచర్‌ సాధ్యమౌతుందని వాట్సప్‌ తెలిపింది. వ్యాపార సంస్థలతో కూడా ఇలాగే నంబర్‌ ఇవ్వకుండా వాట్సప్‌ సర్వీసులు పొందొచ్చు.

Leave a Reply