కరిగిపోతున్న లాభాలు
ఇరాన్‌తో శాంతి చర్చలు ప్రారంభించేందుకు పలు ప్రతిపాదనలను అమెరికా పంపిందన్న వార్తలతో ప్రపంచ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. పలు మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. ఉదయం నుంచి భారీ లాభాల్లో ఉన్న అమెరికా ఫ్యూచర్స్… అసలు మార్కెట్ ప్రారంభం తరవాత తరిగిపోతున్నాయి. ఆరంభంలో 46,718 పాయింట్లను తాకిన డౌజోన్స్ ఇపుడు 46,399 వద్ద ట్రేడవుతోంది. అంటే మూడు వందల పాయింట్లకుపైగా లాభాలు తగ్గాయన్నమాట. అలాగే నాస్‌డాక్ కూడా 22093 నుంచి 21971 పాయింట్లకు క్షీణించింది. డాలర్ ఇండెక్స్ మాత్రం పెరుగుతోంది. ముడి చమురు 5 శాతం తగ్గినా బ్రెంట్ క్రూడ్ 100 డాలర్ల వద్దే ఉంది. దీంతో ఆరంభ లాభాలు చివరిదాకా ఉంటాయా అన్న టెన్షన్ మార్కెట్‌లో నెలకొంది. ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు పాకిస్తాన్ చొరవ తీసుకుందని, అమెరికా ప్రతిపాదనలను ఇరాన్‌కు అందినట్లు అల్ జజీరా పేర్కొంది. అయితే తాము చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ ముగింపు ఎలా ఉంటుందో చూడాలి మరి.
