For Money

Business News

స్థిరంగా వాల్‌స్ట్రీట్‌

మరికొన్ని గంటల్లో ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ స్తబ్దుగా ఉంది. ఆరంభంలో నష్టాల్లోకి జారకున్నా.. ప్రస్తుతం స్థిరంగా ట్రేడవుతోంది. కీలక సూచీల్లో పెద్ద మార్పులు లేవు. ఫెడలర్‌ రిజర్వ్‌ ఇవాళ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం బాగా తగ్గుతున్నందున మున్ముందు వడ్డీ రేట్లను తగ్గిస్తుందా? ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ఏమంటారనే అంశాలపై మార్కెట్‌లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కంపెనీ తన అంచనాలను తగ్గించడంతో ఫైజర్‌ షేర్‌ 8 శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. 20 లక్షల కార్లను వెనక్కి తెప్పించడంతో పాటు మూడు ప్రధాన మోడల్స్‌పై సబ్సిడీ తగ్గిస్తున్నట్లు టెస్లా ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్‌ 3 శాతం క్షీణించింది.