ఎన్నారై రెమిటెన్స్‌లపై 5% పన్ను

ప్రవాస భారతీయులకు మరో షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలోని విదేశీయులు పంపే రెమిటెన్స్‌లపై 5 శాతం పన్ను విధించాలని ట్రంప్ నిర్ణయించారు. దీంతో ఎన్నారైలు కూడా ఇక నుంచి తాము పంపే సొమ్ముపై 5 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన బిల్లును ప్రతినిదుల సభ ఈనెల 26కల్లా ఆమోదం తెలుపనుంది. తరవాత ఈ బిల్లు సెనేట్ పరిశీలనకు వెళుతుంది. అక్కడ కూడా జులై 4లోగా బిల్లుకు ఆమోదం పడే అవకాశముంది. ఆమోదం లభించిన వెంటనే ప్రతిపాదిత పన్నును వసూలు చేయాల్సిందిగా అధికారులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు వెళతాయి. ప్రస్తుతం భారత్‌కు వివిధ దేశాల నుంచి దాదాపు 12,000 కోట్ల డాలర్ల సొమ్ము వస్తోంది. ఇందులో అత్యధికంగా అమెరికా నుంచి వస్తోంది. సుమారు 28 శాతం సొమ్ము అమెరికా నుంచి ఎన్నారైలు పంపుతున్నారు. ఈ లెక్కను జులై నెల తరవాత లక్ష రూపాయలకు 5వేల రూపాయలను పన్ను రూపేణా అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.