For Money

Business News

కాపర్‌పై 50 శాతం టారిఫ్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. ఇవాళ తాజాగా కాపర్‌పై మరో 50 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. టారిఫ్‌ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ట్రంప్‌ వెల్లడించారు. దిగుమతి అయ్యే కాపర్‌లో 50 శాతం అమెరికా రక్షణ వినియోగిస్తారు. దీనివల్ల భారత్‌పై పెద్దగా ప్రభావం ఉండదని అంటున్నారు. అయితే చిలీ వంటి దేశాలపై అధిక ప్రభావం ఉండే అవకాశముంది.