TODAY: STOCKs in NEWS
ఇవాళ పలు వార్తలకు కంపెనీల షేర్లు స్పందించే ఛాన్స్ ఉంది. కొన్ని పెరగవచ్చు. కొన్న తగ్గొచ్చు. షేర్ల ధరలను ప్రభావితం చేసే అంశాలు ఇవి…
A B Infrabuild: భారత రైల్వేల నుంచి రూ. 66.96 కోట్ల ఆర్డర్
SEAMEC: ONGC నుంచి రూ. 410.7 కోట్ల ఆర్డర్
Jio Financial Services: Allianz Jio Reinsuranceతో జాయింట్ వెంచర్‌కు IRDAI అనుమతి.
Ramky Infra: MIDCతో కంపెనీ అనుబంధ సంస్థ Maha Integrated Life Sciences ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ మహారాష్ట్రలో రూ. 3000 కోట్ల హైటెక్ ఫార్మా పార్క్ అభివృద్ధి చేయనుంది.
Dr. Reddy’s Labs: ఓ కీలక క్లినికల్ ట్రయల్‌ను ఆపినట్లు కంపెనీ వెల్లడించింది. దీని ప్రభావం షేర్ ఉంటుందా లేదా గమనించండి.
KRN Heat Exchanger: QIP ద్వారా రూ. 500 కోట్ల సమీకరణకు బోర్డు ఓకే
Jubilant Ingrevia: రూ. 16.5 కోట్లకు Remidex Pharma టేకోవర్
Nippon Life: అనుబంధ సంస్థ AIFలో 40 శాతం వాటా రూ. 733 కోట్లకు కొన్న AMC-DWS
Zydus Life: కంపెనీ Desidustat tabletsకు China Medical Authority ఆమోదం. ఇది కంపెనీకి అనుకూల అంశం
Dilip Buildcon: రూ. 160 కోట్ల రోడ్ ప్రాజెక్టులో L‑1 బిడ్డర్‌గా నిలిచిన కంపెనీ
RailTel : కొత్తగా రూ. 64 కోట్ల ఆర్డర్
IDBI Bank: బ్యాంక్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను విరమించుకున్న ప్రభుత్వం
VA Tech Wabag: CMWSSB నుంచి రూ. 1000 కోట్ల ఆర్డర్.
Hindalco Industries: extruded aluminium products సరఫరా ఆపేసిన కంపెనీ. ఈ వార్తకు షేర్ స్పందించే ఛాన్స్ ఉంది.
Fertiliser stocks: గ్యాస్ సరఫరాలో ఇబ్బందుల కారణంగా ఈసారి ఎరువుల కొరత ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి ఎరువుల ఎగుమతి మూడేళ్ళ గరిష్ఠానికి చేరింది. రష్యా నుంచి కూడా పెరిగిన దిగుమతులు. ఈ వార్తలకు ఎరువుల కంపెనీల షేర్లు స్పందించే ఛాన్స్ ఉంది.
