For Money

Business News

మాంద్యంలోకి మూడో వంతు ప్రపంచం

ఈ ఏడాది మూడో వంతు దేశాల్లో మాంద్యం ముంచుకొస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) హెచ్చరింది. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌తో పాటు చైనా కూడా ఒకేసారి మాంద్యంలోకి వెళుతాయని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టలినా జార్జీవా అంటున్నారు. ఒక న్యూస్‌ ఛానల్‌తో ఆమె మాట్లాడుతూ.. 10 నెలలు గడిచినా ఉక్రెయిన్‌ సంక్షోభం సమసిపోయేలా కన్పించడం లేదని, మరోవైపు అధిక ద్రవ్యోల్బణం, గరిష్ఠ వడ్డీ రేట్లు, చైనాలో కరోనా వేవ్‌ తదితర అంశాలు ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నాయని ఆమె అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు మాంద్యంలోకి వెళుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేస్తోందని క్రిసలినా చెప్పారు. దీని ప్రభావం మాంద్యం లేని దేశాల్లో కూడా ఉంటుందని అన్నారు. కొవిడ్‌ వేవ్‌ కారణంగా చైనాలో వచ్చే రెండు నెలలూ సంక్లిష్టంగా ఉంటుందని, దీంతో ఆ దేశపు వృద్ధి రేటు మైనస్‌లోకి జారుకుంటుందని, ఫలితంగా ఈ ప్రాంత దేశాలు, ప్రపంచ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని క్రిస్టిలినా పేర్కొన్నారు.