For Money

Business News

టీసీఎస్‌ నికర లాభం రూ. 11,074 కోట్లు

దేశంలోని అతి పెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 59,381 కోట్ల ఆదాయంపై రూ. 11చ074 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ టర్నోవర్‌ మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయినా… నికర లాభం ఫరవాలేదనిపించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ మార్జిన్‌ 23.2 శాతానికి పడిపోయింది. గత త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నిర లాభం కేవలం 0.4 శాతం పెరగ్గా, టర్నోవర్‌ 3 శాతం క్షీణించింది. గడచిన 12 త్రైమాసికాల్లో అతి తక్కువ వృద్ధి రేటును కంపెనీ నమోదు చేసింది. కంపెనీ వొదిలి వెళుతున్న ఉద్యోగుల శాతం తగ్గింది. 20.1 శాతం నుంచి 17.8 శాతానికి పడింది. అంటే కంపెనీ నుంచి వైదొలగే ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఉద్యోగుల జీతాలు పెంచడం వల్ల కంపెనీ నికర లాభం రెండు శాతం మేర తగ్గినట్లు టీసీఎస్‌ పేర్కొంది.