For Money

Business News

టాటా మెటల్‌ కంపెనీలన్నీ టాటా స్టీల్‌లోకి…

తమ గ్రూప్‌లోని అన్ని మెటల్‌ కంపెనీలను టాటా స్టీల్‌ కంపెనీలో విలీనం చేయాలని టాటా గ్రూప్‌ నిర్ణయించింది. దీంతో గ్రూప్‌లోని టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రొడక్ట్స్‌, టాటా టిన్‌ప్లేట్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా, టాటా మెటాలిక్స్‌, టీఆర్‌ఎఫ్‌, ద ఇండియన్‌ స్టీల్‌ అండ్‌ వైర్‌ ప్రొడక్ట్స్‌, టాటా స్టీల్‌ మైనింగ్‌, ఎస్‌ అండ్‌ టీ మైనింగ్ కంపెనీలను టాటా స్టీల్‌లో విలీనం చేస్తారు. వీటిలో టీఆర్‌ఎఫ్‌ లిస్టెండ్‌ కంపెనీ. ఈ కంపెనీ వాటాదారులకు తమ వద్ద ఉన్న ప్రతి టీఆర్‌ఎఫ్‌ షేర్లకు 17 టాటా స్టీల్‌ షేరర్లు కేటాయిస్తారు. గడచిన ఆరు ట్రేడింగ్‌ సెషన్స్‌లో టీఆర్‌ఎఫ్‌ షేర్‌ రెట్టింపు అయింది.