For Money

Business News

టాటా కెమికల్స్‌లో ఈ జంప్‌ ఎందుకు?

టాటా కెమికల్స్‌ షేర్‌ ఇవాళ 13 శాతం పెరిగింది. ఒకదశలో రూ. 1202ను తాకిన షేర్‌ చివర్లో 11.39 శాతం లాభంతో రూ. 1182 వద్ద ముగిసింది. నిన్నటి దాకా ఈ షేర్‌లో డెలివరీ శాతం 20 శాతం కూడా లేదు. అయితే ఇవాళ అనూహ్యంగా షేర్‌ ధర పెరగడంపై మార్కెట్‌లో చర్చ జరుగుతోంది. టాటా సన్స్‌కు సంబంధించి ఆర్బీఐ తాజాగా జారీ చేసిన ఆదేశాలే దీనికి కారణమని తెలుస్తోంది. 2025 సెప్టెంబర్‌ నెలలోగా టాటా సన్స్‌ను లిస్ట్‌ కావాల్సిందిగా ఆర్బీఐ ఆదేశించింది. టాటా సన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 16 లక్షల కోట్లని భావిస్తున్నారు. ఇందులో 50 శాతం డిస్కౌంట్‌తో టాటా సన్స్‌ లిస్ట్‌ కావొచ్చని భావిస్తున్నారు. అంటే లిస్టింగ్‌ రోజున టాటా కెమికల్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.8 లక్షలు ఉంటుందన్నమాట. టాటా సన్స్‌లో టాటా కెమికల్స్‌కు 3 శాతం వాటా ఉంది. అంటే టాటా కెమికల్స్‌ వాటా విలువ రూ. 24,000 కోట్లు అన్న మాట. ఇపుడు టాటా కెమికల్స మార్కెట్‌ క్యాప్‌ రూ. 29,000 కోట్లు. అంటే ప్రస్తుత ధర నుంచి టాటా కెమికల్స్‌ పడే ఛాన్స్‌ చాలా తక్కువని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. భారీ విస్తరణ ప్రాజెక్టులను అమలు చేస్తున్న టాటా కెమికల్స్‌ ఇపుడు రూ. 10,798 కోట్ల ఆదాయంపై రూ. 2,434 కోట్ల నికర లాభం ఆర్జిస్తోంది. సో… బలమైన ఫండమెంటల్స్‌ ఉన్న ఈ కంపెనీ షేర్‌లో డౌన్‌వర్డ్‌ రిస్క్‌ దాదాపు లేనట్లే అన్న మాట.