For Money

Business News

జీ డీల్‌కు సోనీ గుడ్‌బై

గత రెండేళ్ళ నుంచి ఎన్నో ఆటుపోట్లకు గురైన జీ, సోనీ డీల్‌ ఎట్టకేలకు విఫలమైంది. మీడియాలో వస్తున్న వార్తలు దీంతో నిజమయ్యాయి. జీ గ్రూప్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సోనీ వెల్లడించింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని జీ గ్రూప్‌నకు తెలిపింది. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు 9 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. జీ, సోనీ విలీనం తరవాత పునీత్‌ గోయెంకాను సీఈఓగా కొనసాగించేందుకు సోనీ ఇష్టపడలేదు. దీనికి ప్రధాన కారణంగా లిస్టెడ్‌ కంపెనీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా తమ సొంత కంపెనీలకు నిధులు మళ్ళించారనే ఆరోపణలను జీ సీఈఓ పునీత్‌ గోయెంకా ఎదుర్కోవడమే. ఇప్పటికే సెబీ దీనిపై దర్యాప్తు చేసి జరిమానా వేసింది. దీంతో ఈ ఒప్పందం నుంచి వైదొలగాలని సోనీ నిర్ణయించింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్‌ సంస్థ ఇది వరకే ప్రకటించగా. జీ మాత్రం ఒప్పందం కొనసాగుతుందనే ధీమాను అప్పట్లో వ్యక్తం చేసింది. అయితే ఇవాళ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సోనీ అధికారికంగా వెల్లడించింది.