For Money

Business News

స్థిరంగా సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లలో అమ్మకాల వెల్లువ. అంతకుముందు యూరప్‌ మార్కెట్లలోనూ ఇదే స్థితి.ఇపుడు ఆసియా మార్కెట్లలో అదే ట్రెండ్‌ కొనసాగుతోంది. నిన్న భారీగా క్షీణించిన జపాన్ సూచీ ఇవాళ కూడా రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ కూడా. నిన్న మూడు శాతం వరకు పడిన హాంగ్‌సెంగ్ ఇవాళ 0.7 శాతం లాభంతో ఉంది.మొత్తం చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. కోప్సీతో పాటు ఇతర మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లను ఫాలో అయ్యే ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 35 పాయింట్ల లాభంతో ఉంది. అయితే నిఫ్టి ఇలాగే ప్రారంభమౌతుందా అన్నది చూడాలి. ఒకవేళ నిఫ్టి పెరిగినా నిలబడుతుందా అన్నది మరో ప్రశ్న.