For Money

Business News

100 పాయింట్ల లాభంలో SGX NIFTY

అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. రాత్రి కొన్ని కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు బాగుండటంతో పాటు డాలర్‌ మరికాస్త బలహీనపడటంతో ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఆరంభం నుంచి క్లోజింగ్‌ వరకు భారీ లాభాల్లో కొనసాగాయి. మూడు ప్రధాన సూచీలు 1.5 శాతంపైగా లాభంతో ముగిశాయి. ముక్యంగా డౌజోన్స్‌ కూడా 1.6 శాతం పెరగడం విశేషం. నాస్‌డాక్‌ కూడా 1.54 శాతం లాభపడింది. ఇదే స్థాయిలో ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ. బ్రెంట్‌ క్రూడ్‌ రాత్రి ధర 82 డాలర్లపై ఉంటోంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. అత్యధికంగా హాంగ్‌కాంగ్‌ 2.67 శాతం లాభంతో ఉంది. ఇక చైనా మార్కెట్లు కూడా అరశాతంపైగా లాభంతో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ ఒక్కటే కేవలం 0.33 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 103 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి ఓపెనింగ్‌లోనే ఆకర్షణీయ లాభంతో ప్రారంభం కావొచ్చు.