For Money

Business News

ఐటీకి ఏమైంది?

మళ్ళీ ఐటీ రంగానికి చెందిన షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. నిన్న ఐటీ షేర్ల జోష్‌తో నాస్‌డాక్‌ 1.3 శాతం లాభంతో ముగిశాయి. అయితే మన మార్కెట్‌లో మాత్రం ఈ రంగానికి చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి జోరుగా ఉంది. ఇవాళ నిఫ్టిలో టాప్‌ లూజర్స్‌గా ఉన్న అయిదు షేర్లూ ఐటీ రంగానికి చెందినవే. విప్రో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నిఫ్టి టాప్‌ లూజర్స్‌ జాబితాలో ముందున్నాయి. ఇక నిఫ్టి ఇవాళ లాభాలతో ప్రారంభమై.. వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ వీక్లీ నిఫ్టి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడం వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు ఇవాళ తమ పొజిషన్స్‌ను స్క్వేర్‌ ఆఫ్‌ చేసుకుంటారు. దీంతో షేర్లు పెరగవచ్చు. అయితే ఈ ట్రేడింగ్‌ సెషన్‌ వరకు ఈ లాభాలు ఉంటాయా అన్నది చూడాలి. ఒకవేళ నిలిచినా రేపటి ట్రేడింగ్‌ కీలకంగా మారనుంది. మరోవైపు ఈఎంస్‌ రంగానికి చెందిన షేర్లకు ఇవాళ మంచి మద్దతు లభించింది. అలాగే ఈసారి వేసవి బాగా ఉంటుందన్న వార్తల కారణంగా పవర్‌ రంగానికి చెందిన షేర్లకు మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా విద్యుత్‌ ఉత్పత్తి రంగానికి చెందిన షేర్లు పెరుగుతున్నాయి. అలాగే ఏసీలు తయారు చేసే కంపెనీలకు కూడా డిమాండ్‌ రావొచ్చు.

Leave a Reply