For Money

Business News

NIFTY TRADE: అధిక స్థాయిలో అమ్మండి

రీటైల్‌ ద్రవ్యోల్బణం 6.3 శాతం నుంచి 6.27శాతానికి తగ్గింది. అంటే దాదాపు తగ్గలేదు. ధరలు అధికంగా ఉన్నాయి. జనం అధిక ధరలతో సతమతమౌతున్నారు. అయితే స్టాక్‌ మార్కెట్‌ చాలా ఖుషీగా ఉంది. నిఫ్టి భారీ లాభాలతో ప్రారంభం కానుంది. కారణం… ఆగస్టులో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచదు. సో తక్కువ వడ్డీ రేట్లు కొనసాగుతాయి. ఇది లెక్క. మరి ఉత్సాహం, ఊపుఎంత వరకు కొనసాగుతుంది. టెక్నికల్స్‌ ఏమంటున్నాయి? నిఫ్టి క్రితం ముగింపు 15,692. సింగపూర్‌ నిఫ్టి లెక్కన చూస్తే నిఫ్టి ఓపెనింగ్‌లోనే 15,820 ప్రాంతానికి చేరాలి. అంటే 15,800పైన నిఫ్టి ఓపెన్‌ అయ్యే ఛాన్స్‌ అధికంగా ఉంది. ఇదే జరిగితే నిఫ్టి ఓపెనింగ్‌లో 15,835 ప్రాంతానికి వస్తుందేమో చూడండి. 15,800-15,835 మధ్య నిఫ్టి వీక్‌గా ఉంటే అమ్మండి. స్టాప్‌లాస్‌ 15,850. నిఫ్టి పెరిగేంత వరకు ఆగి అమ్మండి. ఎందుకంటే నిఫ్టి 15,850 దాటితే బుల్‌రన్‌లోకి వెళ్ళినట్లే. 15,835 దాటితే అమ్మొద్దు. ట్రేడ్‌ చేయొద్దు. నిఫ్టి గనుక ఓపెనింగ్‌లో లేదా గంట తరవాత గరిష్ఠ స్థాయికి వస్తే అమ్మండి. నిఫ్టి పడితే తొలి లెవల్‌ 15,780ని గమనించండి. ఇక్కడా బలహీనంగా ఉంటే 15,750 వరకు ఆగండి. బహుశా నిఫ్టికి 15,750-15,780 మధ్య మద్దతు లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే నిఫ్టి 15,750 దిగువకు వస్తే 15,710 వరకు మద్దతు లేదు. మీ రిస్క్‌ను బట్టి ఏదో ఒక చోట లాభాలు స్వీకరించండి. డే ట్రేడర్స్‌ ఎక్కడా కొనుగోలు చేయొద్దు. అమ్మిన తరవాత స్టాప్‌లాస్‌ తాకితే నష్టంతో బయట పడండి. కొనుగోలు చేయొద్దు. నిఫ్టి బుల్‌రేంజ్‌లో ఉంది. కాబట్టి పొజిషనల్‌ ట్రేడర్స్‌ అమ్మాల్సిన పనిలేదు. డే ట్రేడర్స్‌ మాత్రం స్ర్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌ పాటించి అమ్మండి.