For Money

Business News

నిఫ్టిలో లాభాల స్వీకరణ

ఉదయం పది గంటలకల్లా ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17,225ని తాకిన నిఫ్టి.. లాభాల స్వీకరణ కారణంగా తగ్గుతూ వచ్చింది. 11 గంటకల్లా నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి మిడ్‌సెషన్‌, ఆ తరవాత కాస్త మద్దతు లభించడంతో గ్రీన్‌లోకి వచ్చింది.కాని సెషన్‌ చివర్లో మళ్ళీ ఒత్తిడి రావడంతో నిఫ్టి 17,076 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ ఒక దశలో గరిష్ఠ స్థాయి నుంచి 175 పాయింట్లు నిఫ్టి పడింది. క్రితం ముగింపుతో పోలిస్తే మాత్రం 56 పాయింట్ల నష్టపోయింది. నిఫ్టి మినహా మిగిలిన సూచీలు గ్రీన్‌లో ఉండటం విశేషం. బ్యాంక్‌ నిఫ్టి 0.4 శాతం లాభపడగా, మిడ్‌ క్యాప్‌ సూచీ ఏకంగా ఒక శాతంపైగా లాభంతో ముగిసింది. ఇటీవల బాగా పెరిగిన మెటల్స్‌లో లాభాల స్వీకరణ కన్పించింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఏషియన్‌ పెయింట్స్‌ 3,300.50 3.10
టాటా మోటార్స్‌ 294.65 2.56
ఎస్‌బీఐ లైఫ్‌ 1,214.40 1.87
నెస్లే ఇండియా 19,805.00 1.73
యాక్సిస్‌ బ్యాంక్‌ 798.40 1.51

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఎం అండ్‌ ఎం 769.80 -2.96
సిప్లా 921.90 -2.73
టాటా స్టీల్‌ 1,410.95 -2.71
హిందాల్కో 458.00 -2.20
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 16,788.00 -2.10