పైన్ ల్యాబ్స్ ఐపీఓ రెడీ
ఫిన్‌టెక్ సంస్థ పైన్ ల్యాబ్స్ కూడా ఈ నెలలో ప్రైమరీ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. ఈ నెల 7న కంపెఈ పబ్లిక్ ఆఫర్ ప్రారంభం కానుంది. కంపెనీ రూపాయి ముఖ విలువ గల షేర్లను జారీ చేయనుంది. అయితే ధరల శ్రేణి ఇంకా ఖరారు కాలేదు. తాజాగా షేర్ల జారీ చేయడం ద్వారా రూ.2,080 కోట్లను సమీకరించనుండగా… మరో 8.23 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) ద్వారా ప్రమోటర్లు అమ్మనున్నారు. పీఎక్ ఎక్స్‌వీ పార్టనర్స్, యాక్టిస్, పేపాల్, మాస్టర్‌కార్డ్ ఏషియా, టెమాసెక్, ఇన్వెస్కో, మాడిసన్.. వంటి కంపెనీలో ఆఫర్ ఫర్ సేల్‌తో తమ షేర్లను అమ్మనున్నారు. భారత ప్రమోటర్లు కూడా తమ వాటాలో కొంత భాగాన్ని విక్రయిస్తారు. ఇష్యూ ఈనెల 11న ముగుస్తుండగా, ఈనెల 14వ తేదీన షేర్లు లిస్ట్ కానున్నాయి. నికర ఆఫర్‌లో పది శాతం కన్నా తక్కువ సంఖ్యలో షేర్లను కంపెనీ ఆఫర్ చేయనుంది. రీటైల్ ఇన్వెస్టర్లు గరిష్ఠంగా రూ. 2 లోల వరకు దరఖాస్తు చేయొచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.11.42 లక్షల కోట్ల స్థూల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ఇదే తేదీనాటికి కంపెనీ ఆదాయం రూ. 653 కోట్లు కాగా, నికర లాభం రూ. 4.73 కోట్లు. నెట్‌వర్త్ రూ. 2327 కోట్లుగా కంపెనీ పేర్కొంది. ఎబిటా మార్జిన్ 15.65 శాతం
