For Money

Business News

వాయిదా యుద్ధం వల్ల కాదా?

యుద్ధం కారణంగా ఫోన్‌పే పబ్లిక్‌ ఇష్యూ వాయిదా పడింది. నిధుల సమీకరణకు ఇది సరైన సమయం కాదని కంపెనీ అన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కంపెనీ మార్కెట్‌ వ్యాల్యుయేషన్‌పై కూడా మాతృసంస్థ వాల్‌మార్ట్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ వ్యాల్యుయేషన్‌ రూ. 1400 కోట్ల డాలర్లని వాల్‌మార్ట్‌ అంటోంది. అయితే రోడ్‌ షోల తరవాత సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం 700 కోట్ల డాలర్ల వ్యాల్యుయేషన్‌తో వాటా కొనేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. మార్కెట్‌ నుంచి 130 కోట్ల డాలర్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీ వ్యాల్యుయేషన్‌ మరీ తక్కువగా ఉండటంతో పబ్లిక్‌ ఆఫర్‌ను వాయిదా వేయాలని కంపెనీ భావించినట్లు తెలుస్తోంది. ఫోన్‌ పే నిర్ణయంతో ఇతర న్యూఏజ్‌ కంపెనీల పబ్లిక్‌ ఆఫర్లు కూడా వాయిదా పడే అవకాశముంది. జెప్టో, ఒయో, ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీలు కూడా పబ్లిక్‌ ఆఫర్‌కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీల వ్యాల్యుయేషన్‌ను సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా తగ్గిస్తున్నారు.

Leave a Reply