అమెరికా కంపెనీ చేతికి…?
ఇన్వెస్టర్లకు ఓ పీడకలగా మారిన వోడాఫోన్కు మంచి రోజులు రానున్నాయా? భారీ నష్టాలు, అప్పులతో కూరుపోయిన ఈ కంపెనీని టేకోవర్ చేసేందుకు అమెరికాకు చెందిన పీఈ సంస్థ తిల్మన్ గ్లోబల్ హోల్డింగ్ (TGH) రెడీ అవుతోంది. ఈ మేరకు వోడాఫోన్ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వోడాఫోన్ కంపెనీ యాజమాన్యం తమ చేతికి ఇస్తే కంపెనీలో ఏకంగా 400 కోట్ల నుంచి 600 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడి పెట్టేందుకు టీజీహెచ్ సిద్ధమని అంటోంది. అంటే రూ. 45000 కోట్ల నుంచి రూ. 52800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమౌతోంది. అయితే వోడాఫోన్ కంపెనీకి సంబంధించిన అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్చికల్లా వోడాఫోన్ రూ. 18000 కోట్ల అప్పు చెల్లించాల్సి ఉంది. మరోవైపు వోడాఫోన్ను ఆదుకునే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం హామి ఇచ్చింది. ఈ నేపథ్యంలో TGH ప్రతిపాదన కీలకంగా మారింది.
