For Money

Business News

రూపాయి అయితే మాకొద్దు

గత కొంత కాలంగా రూపాయితో క్రూడ్‌ ఆయిల్‌ అమ్మేందుకు విదేశాలు అంగీకరించడం లేదు. డాలర్‌తోనే తాము క్రూడ్‌ ఆయిల్‌ అమ్ముతామని కంపెనీలు స్పష్టం చేసినట్లు పార్లమెంటు స్థాయీ సంఘం పేర్కొంది. డాలర్‌ బదులు రూపాయికి క్రూడ్‌ అమ్మడం వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని పలు దేశాలు అంటున్నాయి. రూపాయిని మళ్ళీ డాలర్లలో మార్చుకునేందుకు చాలా వ్యయం అవుతోందని, అలాగే డాలర్‌, రూపాయి మారకంలో కూడా వ్యత్యాసం ఉందని ఈ దేశాలు అంటున్నాయి. సాధారణంగా డాలర్‌ కొనేందుకు, అమ్మేందుకు భారత బ్యాంకులు చాలా చార్జి చేస్తాయి. అంటే వ్యత్యాసం చాలా ఉంటుంది. దీంతో చాలా దేశాలుఉ డాలర్లలోనే క్రూడ్‌ అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నట్లు స్థాయీ సంఘం పేర్కొంది.2022 జులైలో రూపాయిల్లో ఆయిల్‌ కొనేందుకు ఆర్బీఐ అనుమతించింది. క్రూడ్‌ కాకుండా ఇతర నూనెల వ్యాపారంలో రూపాయితో డీల్‌ కుదుర్చుకునేందుకు కొన్ని దేశాలు అంగీకరించినా.. క్రూడ్‌ ఎగుమతి చేసే కంపెనీలు మాత్రం ససేమిరా అంటున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క డీల్‌ కూడా రూపాయిల్లో కుదరలేదని స్థాయి సంఘం పేర్కొంది.