For Money

Business News

బేర్‌ ఫేజ్‌ మొదలైనట్లేనా?

ఒకే ఒక్క గెలుపు. వర్ధమానదేశాల తలరాత మారుస్తోంది. మొన్నటిదాకా అమెరికాపై ఆశలు పెట్టుకున్న భారత్‌ వంటి వర్ధమాన దేశాలన్నీ డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచిన తరవాత అనూహ్యంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గించడం ఆర్బీఐకి చాలా కష్టంగా మారుతోంది. ద్రవ్యోల్బణం 6 శాతంపైగా దాటడంతో ఇక వృద్ధిరేటు అంచనాలను తగ్గించక తప్పని పరిస్థితి మన దేశంలో ఏర్పడింది. అన్ని రంగాలు బొటాబొటి వృద్ధి రేటుతో లాక్కొస్తున్నాయి. ఈ సమయంలో డాలర్‌ భారీగా పెరగడం… వాటితో పాటు బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లందరూ అమెరికాకు తమ సొమ్మును తరలిస్తున్నారు. కొంత మంది చైనాకు తరలిస్తున్నారు. వీటికి తోడు ట్రంప్‌ జమానాంలో అమెరికా ఫస్ట్‌ అనే నినాదం ఊపందుకుంటే… ఐటీ కంపెనీలు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే అమెరికాలోని ఎన్నారైలకు కష్టాలు ప్రారంభమౌతాయి. వెరశి డాలర్‌తో రూపాయి మరింత బలహీనమౌతుంది. ఇవన్నీ కూడా స్టాక్‌ మార్కెట్‌ను దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే నెలలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచదని తేలిపోయింది. మరోవైపు పలువురు ఆర్థిక వేత్తలు వివిధ బిజినెస్‌ న్యూస్‌ ఛానల్స్‌తో మాట్లాడుతూ… ఏప్రిల్‌ దాకా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చిన అంటున్నారు. అధిక ధరలు, నిరుద్యోగంతో సతమతమౌతున్న జనాలకు మరిన్ని కష్టాలు తప్పేలా లేదు. అలాగే స్టాక్‌ మార్కెట్‌ బేర్‌ ఫేజ్‌లోకి వెళ్ళే ఛాన్స్‌ అధికంగా ఉందని చాలా మంది టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. ఇవాళ నిఫ్టి 200 రోజుల చలన సగటును తాకి కాస్త పెరిగింది. ఇదే డౌన్‌ట్రెండ్‌ కొనసాగే పక్షంలో నిఫ్టితో పాటు బ్యాంక్‌ నిఫ్టి కూడా 200 రోజుల చలన సగటుకు దిగవకు పడే అవకాశముంది. అదే జరిగితే బేర్‌ ఫేజ్‌ కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశముంది. మొత్తానికి ట్రంప్‌ ఎన్నికల భారత్‌కు పలు చెడు సంకేతాలు ఇస్తోంది.

Leave a Reply