వడ్డీ రేట్లలో మార్పు లేదు
భారత రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీరేట్లను మార్చలేదు. తాజా క్రెడిట్ పాలసీ వివరాలను గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇవాళ వెల్లడించారు. రెపో రేటును అయిదు పాయింట్ రెండు అయిదు శాతం వద్దే ఉంచున్నట్లు తెలిపారు. గత ఏడాదిలో రెపో రేటు గణనీయంగా తగ్గించిన ఆర్బీఐ ఇపుడు మార్చలేదు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపత్యంలో ప్రపంచ వృద్ధి దెబ్బతింటోందని ఆర్బీఐ గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.
