రికవరీ మొదలైందా?
నిన్న రాత్రి వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగిసింది. నామమాత్రపు నష్టాలే కావడంతో పాటు అమెరికా ఫ్యూచర్స్ లాభాల్లో ఉన్నాయి. దీంతో మన మార్కెట్లు కుఊడా ఇవాళ లాభాలతో ప్రారంభం కానున్నాయి. గిఫ్ట్ నిఫ్టి ఇపుడు 140 పాయింట్ల లాభంతో ఉంది. ఇరాన్‌పై అమెరికా ఇది వరకే విధించిన చమురు ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రకటించింది. నౌకల్లో ఉన్న చమురు అమ్ముకునేందుకు అనుమతి ఇస్తామని ఆదేశ ఆర్థిక మంత్రి ప్రకటించారు. అమెరికా ప్రకటనతో చమురు ధరలు శాంతించాయి. అలాగే ఇరాన్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయిల్ దాడి చేయడాన్ని ట్రంప్ ఖండించారు. దీంతో నిన్న 119 డాలర్లను టచ్ చేసిన బ్రెంట్ క్రూడ్ ఇవాళ 105 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్ లాభాలతో ప్రారంభం కానుంది. చమురు క్షేత్రాలపై యుద్ధం ఆగితే ఈ రికవరీ మరింత ముందుకు సాగే అవకాశముంది. ఇది జరగాలంటే నిఫ్టి అధికస్థాయిల వద్ద నిలబడాలని. ఒకవేళ లాభాలు కోల్పోతే 23000 స్థాయి దిగువకు నిఫ్టి వెళ్ళే ప్రమాదముంది. ఒకవిధంగా చావో,రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో మార్కెట్ ఉంది.
