For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

ఊహించినట్లే ఓపెనింగ్‌లోనే 18300 ప్రాంతంలో నిఫ్టిపై ఒత్తిడి వచ్చింది. ఆరంభంలో 18288ని తాకిన వెంటనే నిఫ్టిలో తీవ్ర ఒత్తిడి వచ్చింది. వెంటనే 18245ని తాకింది. ఇపుడు 18252 వద్ద 15 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 55 పాయింట్లు నష్టంతో ఉంది. సో… నిఫ్టి స్థిరంగా ఉంది ఇపుడు. ఇతర ప్రధాన సూచీలదీ ఇదే దారి. కేవలం ఒక్క ఐటీ సూచీ మాత్రం చాలా స్పష్టంగా నష్టాల్లో ఉంది. మిగిలిన సూచీలు కాస్తూ ఇటూ ఇటూగా ట్రేడవుతున్నాయి. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఇన్ఫోసిస్‌ మళ్ళీ ఒక శాతంపైగా నష్టపోయింది. గతవారం రూ. 1700ని దాటిని ఇన్ఫోసిస్‌ ఇవాళ రూ. 1500 దిగువకు వచ్చేసింది. ఎఫ్‌డీఏ నుంచి వార్నింగ్‌ లెటర్‌ రావడంతో సన్ ఫార్మా వీక్‌గా ఉంది. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో సన్‌తో పాటు మిగిలిన షేర్లన్నీ ఐటీ రంగానికి చెందినవే. నిఫ్టి నెక్ట్స్‌ గ్రీన్‌లో ఉండటానికి కారణం.. డీమార్ట్‌, ముతూట్‌ ఫైనాన్స్‌ ఒక శాతంపైగా లాభంతో ఉండటమే. ఇవాళ ఐటీకి భిన్నంగా ఉన్న సూచీ బ్యాంక్‌ నిఫ్టి. నిఫ్టి బ్యాంక్‌ గ్రీన్‌లో ఉండటానికి కారణం పీఎన్‌బీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో పాటు ఫెడరల్‌ బ్యాంక్‌ గ్రీన్‌లో ఉండటమే. నిఫ్టిలో అధిక వెయిటేజీ ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్వల్ప నష్టంతో ఉంది. ఈ షేర్‌ గ్రీన్‌లోకి వస్తే బ్యాంక్‌ నిఫ్టి మరింత కోలుకునే ఛాన్స ఉంది.