For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

అమెరికా, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా… నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 18655ని తాకిన నిఫ్టి ప్రస్తుతం18640 వద్ద ట్రేడవుతోంది. కేవలం రెండు పాయింట్ల నష్టంతో ఉంది. పది గంటలకు ఎంపీసీ మీటింగ్‌ వివరాలను ఆర్బీఐ గవర్నర్‌ ప్రకటించనున్నారు. అప్పటి వరకు నిఫ్టి స్థిరంగా ఉండే అవకాశముంది. నిఫ్టికి భిన్నంగా ఇతర ప్రధాన సూచీలన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. అత్యధికంగా నిఫ్టి నెక్ట్స్‌ అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఇక నిఫ్టి పరంగా చూస్తే ఎల్‌ అండ్‌ టీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించడంతో ఎఎన్‌జీసీ టాప్‌ లూజర్‌గా ఉంది. భారీ అవార్డు లభించడంతో సీమెన్స్‌ 5 శాతం దాకా పెరిగింది. ఇవాళ భారీ డీల్ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ షేర్‌ కూడా 4 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ఇండిగో మూడు శాతం మేర పెరిగింది. దీంతో నిఫ్టి నెక్ట్స్‌ అరశాతం లాభంతో ఉంది.
నాస్‌డాక్‌ వరుసగా నష్టాలతో ముగియడంతో మన ఐటీ షేర్లలో ముఖ్యంగా మిడ్‌క్యాప్ ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది.ఆర్బీఐ గవర్నర్‌ సమావేశం తరవాత మార్కెట్‌ డైరెక్షన్‌పై క్లారిటీ వచ్చే అవకాశముంది.