For Money

Business News

18200పైన నిఫ్టి

నిఫ్టికి ఆరంభంలోనే మద్దతు అందింది. 18,154 వద్ద ప్రాంభమైన నిఫ్టి ఇపుడు 18,202 పాయింట్ల వద్ద 77 పాయింట్ల లాభం వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి ఇక్కడి నుంచి ఎంత ముందుకు వెళుతుందో చూడాలి. నిఫ్టిలో ఏకంగా 41 షేర్లు లాభాల్లో ఉన్నా…నిఫ్టి అరశాతం కూడా పెరగలేదు. అంటే నిఫ్టిలో చాలా షేర్లు నామ మాత్రపు లాభాలతో ఉన్నాయి. మిడిక్యాప్‌ షేర్ల సూచీ కూడా ఇవాళ ఓపెనింగ్‌లో కోలుకుంది. నిన్న మూడు శాతం దాకా పడిన ఈ సూచీ రెండు శాతం నష్టంతో క్లోజైంది.ఇవాళ ఓపెనింగ్‌లోనే 0.9 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిన్నటి వరకు భారీ లాభాలతో నిఫ్టికి మద్దతు అందించిన బ్యాంక్ నిఫ్టి ఇవాళ వెనకడుగు వేసింది. నామ మాత్రపు లాభంతో ట్రేడవుతోంది. ఎల్లుండి నెలవారీ, వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున డే ట్రేడర్స్‌ జాగ్రత్తగా ట్రేడ్‌ చేయండి.