For Money

Business News

LEVELS: నిఫ్టి పడే ఛాన్స్‌ ఎక్కువ

సింగపూర్‌ నిఫ్టి ఇపుడు గ్రీన్‌లో ఉంది. నిఫ్టి ప్రారంభమైనా స్వల్ప లాభానికే పరిమితం కావొచ్చు. నిఫ్టి గనుక పడితే అమ్మడానికి ఛాన్స్‌ ఉందని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి 18600 కాల్ రైటింగ్‌చాలా అధికంగా ఉంది. ఓపెన్‌ ఇంటరెస్ట్‌ బాగా పెరిగింది. అలాగే ఇదే స్థాయిలో అంటే 18600 పుట్‌ రైటింగ్‌లో అన్‌ వైండిగ్‌ చాలా అధికంగా ఉంది. అంటే నిఫ్టి ఈ స్థాయిలో చాలా బలహీనంగా ఉంది. నిఫ్టి పెరిగితే అమ్మమని అంటే సెల్‌ ఆన్‌ ర్యాలీ పద్ధతిని ఫాలో అవ్వాల్సిందిగా సీఎన్‌బీసీ ఆవాజ్‌ మేనేజింగ్ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్ సూచిస్తున్నారు. నిఫ్టిని అమ్మేవారు 18668ని స్టాప్‌లాస్‌తో ఉంచుకోవాలని ఆయన సూచించారు. నిఫ్టి ఇవాళ 20 రోజుల డీఎంఏ అయిన 18450ని తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆయన అన్నారు. గుజరాత్, హిమాచాల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. టెక్నికల్‌గా నిఫ్టి ప్రస్తుతానికి సెల్‌ సిగ్నల్‌ ఇస్తోందని అనలిస్టులు అంటున్నారు. బ్యాంక్‌ నిఫ్టి ఇప్పటికీ బలంగా ఉందని… ఒకవేళ బ్యాంక్‌ నిఫ్టి గనుక బలహీనపడితే మార్కెట్ పతనం జోరుగా ఉంటుందని అనూజ్‌ సింఘాల్‌ అంటున్నారు. బ్యాంక్‌ నిఫ్టిలో ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎలా స్పందిస్తుందో చూడాలని అన్నారు. బలహీనంగా ఉన్నా బ్యాంక్‌ నిఫ్టిని షార్ట్‌ చేసే పరిస్థితి లేదని… నిఫ్టిని మాత్రం అమ్మొచ్చని అనలిస్టులు అంటున్నారు.