For Money

Business News

రేపు లాభాలతో నిఫ్టి ప్రారంభం

మిలాద్‌ ఉన్ నబి పండుగ సందర్భంగా రేపు అంటే సోమవారం పాలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే. స్టాక్‌ మార్కెట్లు మాత్రం యధాతథంగా పనిచేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. గత శుక్రవారం యూరో, అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా వాల్‌స్ట్రీల్‌లోని మూడు ప్రధాన సూచీలు అరశాతంపైగా లాభపడ్డాయి. డౌజోన్స్‌ 0.72 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.54 శాతం, నాస్‌డాక్‌ 0.65 శాతం లాభంతో ముగిశాయి. డాలర్‌ ఇండెక్స్‌ క్రమంగా బలహీనపడుతోంది. 101 దిగువన డల్‌గా ట్రేడవుతోంది. డాలర్‌ వీక్‌ కావడంతో బులియన్‌ మార్కెట్లు చెలరేగిపోతున్నాయి. ఔన్స్‌ బంగారం ధర అమెరికా మార్కెట్‌లో 2606 డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలో రేపు స్టాక్‌ మార్కెట్లు కూడా లాభాలతో ప్రారంభం కానున్నాయి. గిఫ్టి నిఫ్టీ ప్రస్తుతం గ్రీన్‌లో ఉంది. బజాజ్‌ హౌసింగ్‌ లిస్టింగ్ నేపథ్యంలో రేపు కూడా బజాజ్‌ ట్విన్స్‌ లాభాల్లో ట్రేడయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.