పాజిటివ్ ఓపెనింగ్ కానీ….
ఇవాళ మార్కెట్ స్థిరంగా ప్రారంభమయ్యే ఛాన్స్ కన్పిస్తోంది. వాల్‌స్ట్రీట్‌తో పాటు అమెరికా ప్యూచర్స్ కూడా గ్రీన్‌లో ఉండటం మన మార్కెట్లకు శుభసూచకం. గిఫ్ట్ నిఫ్టి కూడా 35 పాయింట్ల లాభంలో ఉంది. అయితే మార్కెట్‌లో ‘క్రూడ్’ టెన్షన్ కొనసాగుతోంది. తగ్గినట్లు తగ్గినా బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లపైనే ఉంటోంది. దీంతో క్రూడ్ సంబంధిత షేర్లలో ఒత్తిడి కొనసాగే అవకాశముంది. మరోవైపు వాణిజ్య గ్యాస్‌పై నిషేధంతో అనేక కంపెనీలపై ప్రభావం పడుతోంది. ఆ రంగాలకు చెందిన కంపెనీలు కూడా డల్‌గా ఉన్నాయి. ఇపుడు అందరూ నాన్ క్రూడ్, నాన్ గ్యాస్ సంబంధిత కంపెనీలపై దృష్టి పెట్టారు. బ్యాంక్ షేర్లతో పాటు భారతీ ఎయిర్‌టెల్ వంటి కంపెనీలపై ట్రేడింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. మరి ఇవాళ కూడా లాభాలు కొనసాగుతాయా లేదా అధిక స్థాయిల వద్ద ఒత్తిడి వస్తుందా అన్నది చూడాలి.
