For Money

Business News

ఆరంభంలోనే తుస్సు మన్న నిఫ్టి

గిఫ్ట్‌ నిఫ్టి 150 నుంచి 100 పాయింట్ల మధ్య కదలాడినా… ఓపెనింగ్‌లో నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది. ఓపెనింగ్‌లోనే 23098 పాయింట్లను తాకింది. అక్కడి నుంచి కోలుకుని 23248 పాయింట్లకు చేరినా… అదిక స్థాయిలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఇపుడు 35 పాయింట్ల నష్టంలో 23124 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పెరగడంతో మార్కెట్‌లో అందోళన కన్పిస్తోంది. డాలర్‌ ఇండెక్స్‌ 100 పైన ఉండటంతో ఇవాళ USD INR క్రితం ముగింపు వద్దే ప్రారంభమైంది. గతవారాంతపు లాభాలు ఏవీ కన్పించడం లేదు. దీంతో షేర్లు ఏమాత్రం పెరిగినా ఒత్తిడి కన్పిస్తోంది. దాదాపు అన్ని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు రెడ్‌లో ఉన్నాయి. చాలా మంది అనలిస్టులు రియల్‌ ఎస్టేట్‌ షేర్లకు సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రతిపాదన విరమించుకోవడంతో ఐడీబీఐ బ్యాంక్‌ షేర్ ఏకంగా 15 శాతం నష్టంతో ట్రేడవుతోంది. 25 శాతం షేర్లు కూడా గ్రీన్‌లో లేవు. మిడ్‌ క్యాప్‌ సూచీ అర శాతం నష్టంతో ఉంది. నిఫ్టిలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసిం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఆటో, హిందాల్కో షేర్లు టాప్‌ గెయినర్స్‌ గా ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో శ్రీరామ్‌ ఫైనాన్స్, బీఈఎల్‌, ఓఎన్‌జీసీ, మ్యాక్స్‌ హెల్త్‌, ఏషియన్‌ పెయింట్స్‌ ఉన్నాయి. యుద్ధం ప్రారంభం కాగానే రూ. 470ని తాకిన బీఈఎల్‌ షేర్‌ ఇవాళ రూ. 425ని తాకడం విశేషం.

Leave a Reply