For Money

Business News

సూచీలు డల్‌… షేర్లు జూమ్‌

నిఫ్టి ఇవాళ పరిమిత లాభాల్లో ముగిసింది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్ కావడంతో నిఫ్టి ఆరంభం నుంచి స్తబ్దుగా ఉంది. మిడ్‌ సెషన్‌ తరవాత అంటే పొజిషన్స్‌ క్లోజింగ్‌కు ముందు ఒత్తిడికి గురైనా… గ్రీన్‌లో ముగిసింది. 2 గంటల తరవాత నిఫ్టి క్రమంగా క్షీణిస్తూ నష్టాల్లోకి జారుకున్నా… 2.30కల్లా మళ్ళీ లాభాల్లోకి వచ్చింది. ఒకదశలో నిఫ్టి 21,593ని తాకినా.. తరవాత కోలుకుని 21647 వద్ద ముగిసింది. నిఫ్టి కేవలం 28 పాయింట్ల లాభంతో ముగిసినా… నిఫ్టి నెక్ట్స్ ఏకంగా 0.96 శాతం లాభపడటం విశేషం. ఈ సూచీని ప్రాతినిధ్యం వహించే షేర్లలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌ షేర్‌ ఏకంగా 5.6 శాతం లాభపడింది. ఆ తరవాత టొరెంట్ ఫార్మా 4.68 శాతం లాభపడగా… వేదాంత కూడా మూడు శాతంపైగా లాభంతో ముగిసింది. మిడ్‌క్యాప్‌ సూచీలో ఓల్టాస్‌ ఏకంగా 4 శాతంపైగా లాభంతో ముగిసింది. హెచ్‌పీసీఎల్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌తో పాటు అబాట్‌ లాబొరేటరీస్‌ మూడు శాతంపైగా లాభంతో ముగిశాయి. ఒక నిఫ్టి విషయానికొస్తే 4.64 శాతం లాభంతో హీరో మోటార్స్‌ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఆటో 3.47 శాతం లాభపడింది. ఫలితాలకు ముందు పలు ఐటీ షేర్లు నష్టాలతో ముగిశాయి.