For Money

Business News

LEVELS: పడినా… లేచే ఛాన్స్‌

మార్కెట్‌ ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 18127. మరి ఇవాళ నిఫ్టి 18000 దిగువకు వెళుతుందా అన్నది చూడాలి. అయితే దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు అందే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే మార్కెట్‌ ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లోకి వచ్చింది. నిన్నటి ఓపెన్‌ ఇంటరెస్ట్‌ చూస్తే 18200, 18300, 18400పైన కాల్‌ రైటింగ్‌ దాదాపు ఒకే స్థాయిలో 50 లక్షల వద్ద ఉంది. 18200 వద్ద నిన్న భారీగా కాల్‌ రైటింగ్ జరిగింది. పై స్థాయిలో ఇక్కడ బ్రేక్‌ పడే ఛాన్స్‌ ఉన్నా… దిగువ స్థాయిలో పుట్‌ రైటింగ్‌ బాగా తగ్గింది. 18000 వద్ద భారీ పుట్‌ రైటింగ్‌ ఉంది. అంటే నిఫ్టి ఈ స్థాయిని కాపాడుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే 17900 వద్ద పుట్‌ రైటింగ్‌ చాలా తక్కువ. నిన్న కేవలం 9వేల ఓపెన్‌ ఇంటరెస్ట్‌ పెరిగింది. మొత్తంగా చూసుకున్నా 20 వేలు దాటలేదు. దీంతో మార్కెట్‌ ఇప్పటికే ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లోకి వెళ్ళిందని చెప్పాలి. సో… దిగువ స్థాయి నుంచి నిఫ్టి కోలుకునే ఛాన్స్‌ ఉందని… ఓపెనింగ్‌లో అంటే 18000 వద్ద నిఫ్టిని షార్ట్‌ చేయొద్దని సీఎన్‌బీసీ ఆవాజ్‌ డేటా అనలిస్ట్‌ వీరందర్‌ కుమార్‌ అంటున్నారు. అయితే నిఫ్టి ఇపుడు కొనుగోలు చేయొచ్చా అంటే… డే ట్రేడింగ్‌కు దిగువ స్థాయిలోకొనుగోలు చేయొచ్చు. అయితే పొజిషనల్‌ ట్రేడర్స్‌ మాత్రం నిఫ్టి 18300స్థాయిని స్పష్టంగా దాటే వరకు ఆగాలని అంటున్నారు. దిగువ స్థాయిలో కొనేవారు నిఫ్టి 18180 నుంచి 18230 ప్రాంతంలో బయటపడొచ్చు. షార్ట్‌ కవరింగ్‌ వస్తే నిఫ్టి ఈ స్థాయిని అందుకోవచ్చు. నిఫ్టి గనుక ఓపెనింగ్‌లో 18000 స్థాయిని కోల్పోతే రిస్క్‌ తీసుకునేవారు 18000 ప్రాంతంలోనే కొనుగోలు చేయొచ్చు. లేదా 17970 ప్రాంతంలో కొనొచ్చు. స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌తో కొనండి. 30 లేదా 40 పాయింట్ల స్టాప్‌లాస్‌ ఉంచుకోవచ్చు. నిఫ్టిని మాత్రం ఓపెనింగ్‌లో అమ్మొద్దని వీరేందర్‌ సలహా ఇస్తున్నారు.