For Money

Business News

LEVELS: 18,350 కీలకం

మార్కెట్‌ మళ్ళీ కన్‌ఫ్యూషన్‌లో ఉంది. దీంతో చాలా తక్కువ వ్యత్యాసంతో కదలాడే అవకాశం అధికంగా ఉంది. నిన్న యూరో మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్‌ చూసి… నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. కాని యూరోలో బలం లేకపోగా… అమెరికాలో మళ్ళీ భారీ నష్టాలు తప్పలేదు. ముఖ్యంగా నాస్‌డాక్‌ పతనం ఈక్విటీ మార్కెట్‌ ఇన్వెస్టర్లను కలవర పరుస్తోంది. నాస్‌డాక్‌ 52 వారాల కనిష్ఠ స్థాయి 10058 కాగా, రాత్రి 10,497ను తాకింది. ఇపుడు అందరి దృష్టి నాస్‌డాక్‌ కొత్త కనిష్ఠ స్థాయిని నమోదు చేస్తుందా లేదా 52 వారాల కనిష్ఠ స్థాయి వద్ద కోలుకుంటుందా అనేది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పొజిషనల్‌ ట్రేడ్‌.. బదులు డే ట్రేడింగ్‌కు ఇష్టపడుతున్నారు. నాస్‌డాక్‌పై క్లారిటీ వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. దీంతో ఇవాళ కూడా నిఫ్టి 18350 నుంచి 18500 మధ్య కదలాడే ఛాన్స్‌ ఉంది. నిఫ్టి ఒకవేళ పడితే 18350 లేదా 18340 ప్రాంతానికి వస్తుందేమో చూడండి. ఇక్కడ కొనుగోలు చేసినా.. 18300ను స్టాప్‌లాస్‌గా ఉంచుకోంది. ఇది చాలా కీలకస్థాయి అని సీఎన్‌బీసీ ఆవాజ్‌ డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు. 18300 బ్రేక్‌ చేస్తే నిఫ్టి మరింత బలహీనపడుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. కాబట్టి 18340 ప్రాంతంలో కొనేవారు స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయాలని… నిఫ్టి 18366ని దాటితే 18453 లేదా 14490ని తాకే అవకాశముందని ఆయన సూచిస్తున్నారు. రిస్క్‌ వొద్దనుకునేవారు ఈ స్థాయిలోనే లాభాలు స్వీకరించడం మంచిది. భారీ లాభాల కోసం వెయిట్‌ చేయకుండా వచ్చిన కొద్దిపాటి లాభాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. ట్రెండ్‌ క్లియర్‌ అయ్యే వంత వరకు పొజిషనల్‌ లాంగ్‌ కోసం కొనుగోళ్ళు చేయొద్దని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నిఫ్టి18600 ప్రాంతంలో 18600 ప్రాంతంలో కాల్‌ రైటింగ్‌ చాలా గట్టిగా ఉంది. అదే సమయంలో 18300 పుట్‌రైటింగ్‌ కూడా భారీగా ఉంది. కాబట్టి ఈ స్థాయిలో నిఫ్టికి మద్దతు లభింవచ్చు.