For Money

Business News

LEVELS:18300పైన అమ్మొద్దు

నిఫ్టి క్రితం ముగింపు 18202. ఇవాళ నిఫ్టి కనీసం 50 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యే అవకాశముంది. టెక్నికల్‌గా నిఫ్టికి తొలి అవరోధం 18274 వద్ద ఎదురు కానుంది. ఈ స్థాయి దాటితే 18294 వద్ద రావొచ్చు. ఈ రెండు స్థాయిలలో రిస్క్‌ను బట్టి అమ్మొచ్చు. అమ్మడం ఇష్టం లేని ఇన్వెస్టర్లు నిఫ్టిలో కరెక్షన్‌ కోసం వెయిట్‌ చేయొచ్చు. నిఫ్టికి తొలి మద్దతు 18174 వద్ద కచ్చితంగా అందే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు దిగుకు వస్తే కొనుగోలు చేయొచ్చు. 18132 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయండి. విదేశీ ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్ళతో పాటు పెద్దగా కాల్‌ రైటింగ్‌ లేనందున బై ఆన్‌ డిప్స్‌ ఫార్ములాను ఉపయోగింవచ్చు. కొనేటపుడు మాత్రం స్టాప్‌లాస్‌ మరవొద్దు. 18132 దిగువకు వెళితే నిఫ్టి జోలికి వెళ్ళొద్దు. దానిపైన మీ రిస్క్‌ను బట్టి నిఫ్టిని కొనుగోలు చేయొచ్చు. నిఫ్టి 18294ని దాటి ముందుకు వెళితే మాత్రం షార్ట్‌చే యొద్దని అనలిస్టులు అంటున్నారు.