For Money

Business News

NIFTY LEVELS: 18121 దాటితేనే

నిఫ్టి క్రితం ముగింపు 18062. సింగపూర్ నిఫ్టిలో పెద్ద మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు ఇంకా బలహీనంగా ఉన్నాయి. దాదాపు అనేక బ్లూచిప్‌ కంపెనీలు 2020 కనిష్ఠ స్థాయిలను బ్రేక్‌ చేస్తున్నాయి. అయినా మద్దతు లభిస్తున్న ఛాయలు కన్పంచడం లేదు. అయితే మన మార్కెట్లు మాత్రం భిన్నంగా ఉన్నాయి. భారీ క్షీణతకు అవకాశం లేకున్నా… పెరిగే అవకాశాలు కూడా కన్పించడం లేదు. దీంతో నిఫ్టి 18000-18150 మధ్య కదలాడే అవకాశాలే అధికంగా ఉన్నాయి. నిఫ్టికి బేస్‌ 18010 వద్ద లేదా 17949 వద్ద లభించే అవకాశముందని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు. నిఫ్టి 18121ని పటిష్ఠంగా దాటితేగాని లాంగ్ పొజిషన్‌ తీసుకోవద్దని ఆయన సలహా ఇస్తున్నారు. దిగువ స్థాయిలో మద్దతు ఉన్నా… ఆ స్థాయికి నిఫ్టి పడుతుందా అన్నది చూడాలి. డే ట్రేడర్స్‌ స్వల్ప లాభాలతో ట్రేడ్‌ చేయడం వినా… పెద్ద ట్రేడ్‌ కన్పించడం లేదు.