For Money

Business News

NIFTY LEVELS: పడితే కొనొచ్చా?

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కావొచ్చు. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా క్లోజైనా.. ఫ్యూచర్స్‌ నష్టాల్లోనే ఉంది. ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి గనుక పడితే కొనుగోలుకు ఛాన్స్‌ ఉందని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. అయితే తొలి మద్దతు స్థాయి 17446 వద్ద ఉంది మరి ఈ స్థాయికి నిఫ్టి పడుతుందా అన్నది చూడాలి. నిఫ్టికి ఇవాళ దిగువ స్థాయిలో మద్దతు లభించే అవకాశముంది. ఎందుకంటే నిఫ్టి ఓవర్‌ బాట్‌ జోన్‌ నుంచి బయటపడుతోంది. స్వల్పకాలనికి టెక్నికల్స్‌ బై సిగ్నల్‌ ఇస్తున్నాయి.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌

అప్‌ బ్రేకౌట్‌ – 17720
రెండో నిరోధం – 17672
తొలి నిరోధం – 17640
నిఫ్టికి కీలకం – 17590
తొలి మద్దతు – 17446
రెండో మద్దతు – 17414
డౌన్‌ బ్రేకౌట్‌ – 17366