For Money

Business News

18050 దిగువన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి 90 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్‌లో 18061ని తాకి ఇపుడు 18012 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 102 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఫార్మా, డయాగ్నస్టిక్స్‌ షేర్లు మినహా చాలా రంగాలకు చెందిన షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. నిఫ్టి షేర్లను చూస్తే మార్కెట్‌ ట్రెండ్‌ అర్థమౌతోంది. నిఫ్టి కేవలం అర శాతం నష్టంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి 0.66 శాతం, నిఫ్టి నెక్ట్స్‌ 0.83 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అయితే నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ ఒకశాతంపైగా నష్టంతో ఉంది. నిఫ్టి టాప్‌ ఫైవ్‌ గెయినర్స్‌లో భారతీ ఎయిర్‌ టెల్‌ మినహా మిగిలిన నాలుగు షేర్లు ఫార్మానే. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, సిప్లా, దివీస్‌ ల్యాబ్‌, సన్‌ ఫార్మా గ్రీన్‌లో ట్రేడవుతోంది. పతనంలో మెటల్స్‌ ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లోనూ ఫార్మాదే హవా. అలాగే నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో గ్రీన్‌లో మూడు షేర్లు ఉండగా, రెండు ఫార్మా షేర్లు. నిఫ్టి బ్యాంక్‌లోని మొత్తం 12 షేర్లు రెడ్‌లో ఉన్నాయి. పీఎన్‌బీ టాప్‌ టూజర్‌.