ఐటీ షేర్లూ హ్యాండిచ్చాయి…
గత కొంతకాలంలో మార్కెట్‌కు అండగా నిలిచిన ఐటీ షేర్ల సూచీ కూడా ఇవాళ హ్యాండిచ్చింది. కొన్ని షేర్లు పెరిగినా… మెజారిటీ షేర్లు నష్టాలతో ముగియడంతో సూచీ కూడా నష్టపోయింది. రెండు రోజుల నుంచి నాస్‌డాక్ స్థిరంగా ఉండటమే దీనికి కారణం కావొచ్చేమో. అలాగే గత కొన్ని సెషన్స్‌లో నిఫ్టికి అండగా ఉన్న బ్యాంక్ నిఫ్టి ఇవాళ దారుణ దెబ్బ కొట్టింది. బ్యాంక్ నిఫ్టి గరిష్ఠ స్థాయి నుంచి ఇప్పటి వరకు పది వేల పాయింట్లు కోల్పోయింది. నిఫ్టి ఫైనాన్షియల్స్‌దీ అదే దారి. ఇవాళ ఎక్స్ఛేంజీలో మొత్తం 2864 షేర్లు ట్రేడవగా, 2117 షేర్లు నష్టాల్లో ముగిశాయి. కేవలం 674 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఇక నిఫ్టి షేర్లలో లాభాల్లో ముగిసిన షేర్లు 4 మాత్రమే. 46 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి ఇవాళ కనిష్ఠస్థాయి అంటే 23883 వద్ద ముగిసింది. 258 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 820 పాయింట్లు కోల్పోయింది. లాభాల్లో లేదా స్థిరంగా నిలబడిన షేర్లలో చాలా వరకు న్యూఏజ్ షేర్లు ఉండటం విశేషం. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో ఇవాళ ట్రెంట్, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ నిలిచాయి. ఇక నష్టపోయినవాటిలో బ్రిటానియా దారుణంగా 7.3 శాతం నష్టపోయింది. బీఈఎల్, ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు మూడు శాతం చొప్పున నష్టపోయాయి.