For Money

Business News

వరుస లాభాలకు బ్రేక్‌

వరుసగా మూడు రోజుల నుంచి లాభాలు పొందిన మార్కెట్‌కు బ్రేక్‌ పడింది. 18000పైన నిఫ్టికి మరోసారి చుక్కెదురైంది. అంతర్జాతీయ మార్కెట్లు వరుస నష్టాలకు అనుగుణంగా నిఫ్టి కదలాడింది. వీక్లీ సెటిల్‌మెంట్‌ దృష్ట్యా షార్ట్‌ కవరింగ్‌తో పెరిగిన నిఫ్టి ఇవాళ 92 పాయింట్ల నష్టంతో 17944 వద్ద ముగిసింది. ఇవాళ బ్యాంకు షేర్లలో గట్టి ఒత్తిడి వచ్చింది. అలాగే మిడ్‌ క్యాప్‌ షేర్లలో కూడా. నిఫ్టిలో ఏకంగా 33 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్‌ షేర్లు ఇవాళ మళ్ళీ నష్టాల్లోకి జారకున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్‌ నాలుగు శాతం నష్టపోగా, అదానీ పోర్ట్స్‌ స్థిరంగా ముగిసింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ నష్టాల్లో క్లోజ్‌ కాగా, అదానీ గ్రీన్‌ రెండు శాతం లాభంతో ముగిసింది. బ్యాంకు నిఫ్టిలోని అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మూడు శాతం క్షీణించగా, బంధన్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ షేర్లు రెండు శాతంపైగా నష్టంతో ముగిశాయి.